భూములు స్వాధీనం చేసుకుంటాం: అటవీ శాఖ
AP: రాష్ట్రంలో అటవీ భూములు అన్యాక్రాంతమయ్యామని అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతి రావు తెలిపారు. మంగళంపేటలో 32.63 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారన్నారు. నిబంధనల ప్రకారం భూములు స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు. అక్రమార్కులకు సహకరించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. Dy.CM పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ భూముల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామన్నారు.