శాంతాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

శాంతాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

KMR: బిచ్కుంద మండలంలోని శాంతాపూర్‌లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను సంఘం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం విక్రయించుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సంగారెడ్డి, డైరెక్టర్లు నాగిరెడ్డి, హనుమయ్య, సెక్రటరీ సందీప్ కుమార్ తదితరులున్నారు.