డ్రైనేజీపై పడి ఉన్న శిథిల డబ్బాలు తొలగించాలని డిమాండ్
NRPT: ఊట్కూర్‌లోని స్వామి వివేకానంద చౌరస్తా వద్ద ప్రాథమిక పాఠశాల సమీపంలో డ్రైనేజీపై ఉన్న శిథిల డబ్బాలు అడ్డంకిగా మారాయి. వాటి మధ్య మలమూత్ర విసర్జనల వల్ల దుర్వాసన వ్యాపించి పాఠశాల వంటగది, కార్యాలయానికి ఇబ్బందులు కలుగుతున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపయోగ డబ్బాలు తొలగించి ప్రాంతాన్ని శుభ్రపరచాలని కోరుతున్నారు.