పూలే జయంతి వేడుకల నిర్వహణకు నిధులు

పూలే జయంతి వేడుకల నిర్వహణకు నిధులు

MNCL: సింగరేణి వ్యాప్తంగా ఈనెల 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల నిర్వహణకు నిధులు కేటాయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ. 3.40 లక్షలు కేటాయించగా.. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలకు రూ. 25 వేలు చొప్పున, జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు రూ. 15 వేలు కేటాయించారు.