"పునరావాస పనుల పంపిణీలో జాప్యం వద్దు"
KDP: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్ఆర్ పెండింగ్ పనులపై మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.శ్రీధర్ సమీక్షించారు. JC నిధి మీనా, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం, పునరావాస పంపిణీలో అస్సలు జాప్యం చేయొద్దని అధికారులకు స్పష్టం చేశారు. భూసేకరణకు బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన పర్యావరణ అనుమతులను తీసుకోవాలన్నారు.