ఎంపీడీవో కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఎల్డీవో
ప్రకాశం: కొనకనమిట్ల మండల పరిషత్ కార్యాలయాన్ని ఇవాళ డీ.ఎల్.డీ.వో శ్రీనివాసరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులు, స్వామిత్వ వెక్టోరైజేషన్, అభివృద్ధి కార్యక్రమాలు, సర్వీసులు, ఇంటి పన్ను బకాయిలు, అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. అన్ని కార్యక్రమాలపై సమీక్ష చేసి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈశ్వరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.