శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి  భారీగా వరద

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు 1,51,806 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు 75 శాతం నిండి 1086 అడుగులు (59.766 టీఎంసీ) నీటిమట్టానికి చేరింది. దిగువకు 5,005 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. కాకతీయ కాల్వ ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.