రేపు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం
కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు ఉచిత కంటి, ఆయుర్వేద శిబిరం, మధ్యాహ్నం 3గంటలు నుంచి 5గంటలు వరకూ ఉచిత చిన్న పిల్లలు, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.