VIDEO: శీకివారిపల్లిలో సప్పలమ్మ కు బోనాలు
సత్యసాయి: నల్లమాడ మండలం శీకివారిపల్లిలో శ్రీరామనవమి పండుగ తరువాత వచ్చే మంగళవారం సప్పలమ్మ కు బోనాలు సమర్పించడం ఈ గ్రామం పూర్వపు పెద్దల ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా మంగళవారం గ్రామంలోని మహిళలు నృత్యాలతో సప్పలమ్మ కు బోనాలు సమర్పించారు. గ్రామంలోని పిల్లల నుంచి పెద్దల వరకు సందడి వాతావరణం నెలకొంది. ఎద్దుల బండ్లతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేశారు.