'కుక్కల బెడద నుంచి చర్యలు తీసుకోవాలి'
అన్నమయ్య: రామాపురంలో హైవే రోడ్డుపై కుక్కల బెడద ఎక్కువైంది. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై ఒంటరిగా వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నామని ప్రజలు అంటున్నారు. కుక్కల బెడద లేకుండా అధికారులు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.