VIDEO: 'కారు బైకు ఢీ ఇద్దరికి స్వల్ప గాయాలు'

AKP: గొలుగొండ మండలం ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న కారు, బైకు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. మంగళవారం ఆరిలోవ అటవీ ప్రాంతంలో రాజులబాబు గుడి వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. నర్సీపట్నం నుంచి ఏలేశ్వరం వెళుతున్న కారు, కృష్ణాదేవిపేట నుంచి నర్సీపట్నం వస్తున్న బైక్ రాజులబాబు గుడి వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి ఢీ కొన్నాయి.