భారీ వర్షం.. నీట మునిగిన పత్తి పంట

VKB: నాగసాన్‌పల్లి గ్రామంలో శనివారం కురిసిన భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పత్తి, కంది, పెసర, కూరగాయల పంటలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయని రైతులు వాపోతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.