గురుకుల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ
KRNL: సి.బెళగల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ఘన విజయం సాధించారు. మార్చి 21న జరిగిన అంబేద్కర్ పాఠశాల 5వ తరగతి ప్రవేశ పరీక్షలో ఎం. కీర్తన, ఎస్. కీర్తి, ప్రేమ్ సాగర్, ఎం. శాంతిమణి అర్హత సాధించి సీట్లు సంపాదించుకున్నారు. నలుగురు విద్యార్థులు ఒకేసారి ఎంపిక కావడం పట్ల ఇవాళ HM మురళిధర్ ప్రశంసలు వ్యక్తం చేశారు.