గౌతు లచ్చన్న సేవలు స్ఫూర్తిదాయకం

VSP: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి సర్దార్ గౌతు లచ్చన్న సేవలు స్ఫూర్తిదాయకమని విశాఖపట్నం జిల్లా శ్రీ శయన కుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షుడు తోట వాసుదేవరావు అన్నారు. గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం ఆయన జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.