VIDEO: ప్రచారంలో ఇస్త్రీ చేసిన ఎమ్మెల్యే సామేలు
సూర్యాపేట: తిరుమలగిరి మున్సిపాలిటీలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బత్తుల శ్రీను తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఇస్త్రీ షాపు వద్ద ఎమ్మెల్యే సామేలు ఇస్త్రీ చేస్తూ ఓటు అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.