VIDEO: ఏడుపాయల అమ్మవారికి అమావాస్య ప్రత్యేక పూజలు

VIDEO: ఏడుపాయల అమ్మవారికి అమావాస్య ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగ్సన్ పల్లి శివారులోని శ్రీ ఏడుపాయల దేవస్థానంలో ఇవాళ అమ్మవారికి అమావాస్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం, కృష్ణపక్షం చివరి రోజు భృగు వాసరే పురస్కరించుకుని వన దుర్గమ్మకు పంచామృతాలు, మంజీరా నది గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి, నైవేద్యం సమర్పించారు. ఈ వేకువ నుంచి భక్తులు సందర్శించి దర్శించుకుంటున్నారు.