'ఓడినా... ఆపదలో నేనున్నానంటూ'

'ఓడినా... ఆపదలో నేనున్నానంటూ'

NLG: చిట్యాల మండలం నేరడలో మృతి చెందిన వడ్డేపల్లి గోపాల్‌కు బీజేపీ నేత శంకరాచారి శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ప్రజలకు సేవలను కొనసాగించడం పట్ల గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.