సిరోల్‌లో పెద్దపులి సంచారం
MHBD: సిరోల్ మండలం కందికొండ శివారులో ఆదివారం పెద్ద పులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. పంట చేలల్లో పులి పాద ముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ మేరకు వారు గ్రామ పరిసర ప్రాంతాల్లొని జనం అప్రమత్తంగా ఉండాన్నారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావలన్నారు. ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.