కాంగ్రెస్ నాయకులతో ఎమ్మెల్యే సమీక్ష

JN: జఫర్ గడ్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.