అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఎల్లారెడ్డి, నాగలక్ష్మి రాములు, ఎంపీడీవో రమాదేవి, డీఈ మిలింద్, ఎంపీవో రవి బాబు, ఏఈ రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ సతీష్, సీనియర్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.