నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కోనసీమ: విద్యుత్ లైన్ పనుల మరమ్మతుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అమలాపురం ఈఈ రాంబాబు తెలిపారు. మురమళ్ల, ఐ. పోలవరం సబ్ స్టేషన్ల పరిధిలోని మురమళ్ల, కొమరగిరి, పశువులంక, కేసనకూరు, కేసనకూరు పాలెం, తిల్లకుప్ప, కమిని గ్రామాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా ఉండదని చెప్పుకొచ్చారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.