కరెంట్ షాక్‌తో రైతు మృతి
MHBD: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇనుగుర్తి (M) చీన్య తండాకు చెందిన జాటోతు దేశ్య నాయక్ రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. రాత్రి నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్తు మోటర్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మరణించాడు. నిత్యం అందరిని ఆత్మయంగా పలకరించే దేశ్య నాయక్ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.