ముదిగొండ మండలంలో జిలుగు విత్తనాల పంపిణీ

ముదిగొండ మండలంలో జిలుగు విత్తనాల పంపిణీ

KMM: ముదిగొండ మండలం మేడేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో 50 శాతం సబ్సిడీపై అందిస్తున్న జిలుగు, పచ్చిరోట్టె విత్తనాలను మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల్ నాగేశ్వరరావు రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పచ్చి రోట్టె పంటల సాగు ద్వారా నేల నాణ్యత మెరుగవుతుందని పేర్కొన్నారు.