గోశాలలో పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ

KMM: టేకులపల్లి గ్రామంలోని వెంకటేశ్వర గోశాలలో వినాయక చవితి పురస్కరించుకొని గోశాల నిర్వాహకులు శ్రీనివాస్ ఆచార్యులు ఆధ్వర్యంలో గోమయంతో తయారుచేసిన పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, సంప్రదాయాల విలువల కోసం ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరమని తెలిపారు.