VIDEO: కోతుల బెడద నివారణకు వినూత్న చర్యలు

VIDEO: కోతుల బెడద నివారణకు వినూత్న చర్యలు

SDPT: కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలో కోతుల బెడదను నివారించేందుకు సర్పంచ్ బోయిని సంపత్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వినూత్న చర్యలు చేపట్టింది. కోతులను తరిమివేయడానికి చింపాంజీ వేషధారణలో ఓ వ్యక్తిని గ్రామంలోని వీధులలో తిప్పించారు. ఈ చర్యలతో కోతులు భయపడి పారిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.