మహిళా పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

మహిళా పోలీసు స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

VZM: జిల్లా మహిళా పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బుధవారం సందర్శించి పరిసరాలను, స్టేషన్‌లో రికార్డు రూము, కంప్యూటర్ రూములను పరిశీలించారు. అనంతరం స్టేషన్ రికార్డులను, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నమోదు అయిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట టౌన్ డీఎస్పీ గోవిందరావు, సీఐ నరసింహమూర్తి, లీలారావు పాల్గొన్నారు.