పులి సమాచారం.. ప్రజలు అప్రమత్తం
ఇటిక్యాల మండల కేంద్రం శివారులో పులి సంచరిస్తోందన్న సమాచారం స్థానికుల్లో భయాందోళనకు కారణమైంది. ఇటిక్యాల, వేముల, షాబాద్, బట్లదిన్నె గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు రాత్రికి రాత్రే దండోరా వేయించారు. రాత్రివేళల్లో బయట నిద్రించవద్దని, పాడి పశువులను జాగ్రత్తగా కాపాడాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు ప్రాంతంలో పహారా పెంచారు.