నేడు జాతీయ లోక్ అదాలత్
PLD: పిడుగురాళ్లలో ఇవాళ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు పిడుగురాళ్ల సివిల్ కోర్టు జడ్జి ప్రవళిక శుక్రవారం తెలిపారు. కోర్టు పరిధిలోని కక్షిదారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీ పడవలసిన కేసులను సులువుగా పరిష్కరించుకోవచ్చన్నారు. చెక్ బౌన్స్, ఆస్తి వివాదాలు, భార్యా భర్త గొడవలు, ఎక్సైజ్ కేసులు వంటి వాటిని పరిష్కరించవచ్చన్నారు.