నిషేధిత ప్లాస్టిక్‌కి స్వస్తి చెప్పండి

VSP: పర్యావరణాన్ని హాని కలిగించే 120 కంటే తక్కువ మైక్రాన్లు ఉన్న ప్లాస్టిక్‌ను వినియోగించరాదని హెల్త్ ఆఫీసర్ సునీల్ అన్నారు. బుధవారం 58వ వార్డు పరిధిలో శ్రీహరిపురం, గొల్లలపాలం, కోరమండల్ గేట్ తదితర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించి 8 కేజీల నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ వాడితే చర్యలు తప్పవన్నారు.