నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.