'సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి'
PDPL: సింగరేణి ఆర్జీ 1లోని జీడీకే 11వ గని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ విజ్ఞప్తి చేవారు. ఆయన గని మేనేజర్‌ను కలిసి సమస్యలపై వివరించారు. గనిలోని పని స్థలాల్లో మెరుగ్గా గాలి సరఫరా చేయాలని, తగినన్ని పని మూట్లు ఇవ్వాలని, ఛైర్ కారుల సంఖ్య పెంచాలని కోరారు.