నేర నియంత్రణపై కఠిన నిఘా

నేర నియంత్రణపై కఠిన నిఘా

KDP: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్‌ను విస్తృతంగా అమలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై తనిఖీలు పెంచి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అనుమానాస్పద సమాచారాన్ని డయల్ 112కు తెలియజేయాలని పోలీసులు సూచించారు.