నగదు వివాదంతో గ్రామాల్లో కలకలం

నగదు వివాదంతో గ్రామాల్లో కలకలం

కృష్ణా: మైలవరంలో ఆదివారం నగదు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జరిగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మొరుసుమల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మైలవరానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.