ఎంపీ నగేష్‌ను కలిసిన బౌద్దులు

ఎంపీ నగేష్‌ను కలిసిన బౌద్దులు

ADB: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్‌ను ఆదివారం బౌద్దులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 26న పట్టణంలోని కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్‌లో జరిగే భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ మేరకు ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ, దయానంద్, కాంతారావు, మధు, గంగారాం, సంతోష్ పాల్గొన్నారు.