VIDEO: ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఖమ్మం కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీపీఐ నేత సామినేని రామారావును హత్య చేసిన హంతకులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి ఆ పార్టీ శ్రేణులు వేలాదిగా చేరుకుని రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో సీపీఎం, బీఆర్ఎస్ శ్రేణులు మద్దతుగా వచ్చారు. పోలీసు వాహనాలకు అడ్డుగా పడుకుని నిరసన తెలిపారు.