‘సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం’
E.G: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం ద్వారా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలో ఇవాళ జరిగిన బొంతు వీర లక్ష్మీ గృహప్రవేశ కార్యక్రమానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.