సింగరేణి శుభవార్త.. 1,258 మంది ఉద్యోగులు పర్మినెంట్
BHPL: సింగరేణి సంస్థలో తాత్కాలిక ఉద్యోగులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పనుంది. తాత్కాలిక ఉద్యోగులుగా పని చేస్తున్న 1,258 మందిని రెగ్యులర్ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించాలని యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 2 రోజుల్లో వీరికి నియామక పత్రాలను అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు తాత్కాలిక ఉద్యోగులను రెగ్యులర్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొంది.