తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి

తొక్కిసలాట ఘటన దురదృష్టకరం: రాష్ట్రపతి

గోవాలోని శిర్గావ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.