వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ ఎంపిక

NDL: బనగానపల్లెలో బానుమొక్కల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా టీడీపీ ముస్లిం మైనారిటీ సీనియర్ నాయకుడు అత్తర్ అబ్దుల్ కలాం ప్రమాణ స్వీకారం గురువారం చేశారు. నూతన కార్యవర్గంలో సీఈవో సయ్యద్ అబ్దుల్ మునాఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇద్దరు డైరెక్టర్‌లు ఎన్నికయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి కలాం కృతజ్ఞతలు తెలిపారు.