'బ్యాండ్ మేళం' ట్రైలర్ విడుదల
టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో సతీష్ జవ్వాజి దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ 'బ్యాండ్ మేళం'. ఈ చిత్రం మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. 'కోర్ట్' జోడీ హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ మూవీలో సీనియర్ నటుడు సాయికుమార్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.