VIDEO: ఉగ్రదాడిని ఖండిస్తూ నకిరేకల్లో భారీ ర్యాలీ

NLG: జమ్మూకశ్మీర్లో హిందువులపై టెర్రరిస్టులు జరిపిన దాడికి నిరసనగా నకిరేకల్లో గురువారం రాత్రి విశ్వహిందూ పరిషత్, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. పట్టణంలోని కూడలి నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కాషాయ జెండాలను రెపరెపలాడిస్తూ ర్యాలీని నిర్వహించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతులకు సానుభూతిని తెలిపారు.