వైసీపీ నేతపై దాడి.. ముగ్గురు అరెస్ట్
ASR: రాజవొమ్మంగిలోని వైసీపీ నేత వెంకటేష్ రాజుపై దాడి చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రాజవొమ్మంగి ఎస్సై శివకుమార్ తెలిపారు. రాజమండ్రికి చెందిన అఖిల్ బాబు, జోహిరామ్స్, వెంకటేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.