'యూత్ డిక్లరేషన్ అమలు చేయాలి'
NLG: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీ ప్రకారం యూత్ డిక్లరేషన్ అమలు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ డిమాండ్ చేశారు. మార్చి 26 డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై 'చలో అసెంబ్లీ' కార్యక్రమానికి వెళ్లనీయకుండా మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేసి నిర్భందించడాన్ని తీవ్రంగా ఖండించారు.