కార్మికుల సమస్యలు పరిష్కరించండి: సీఐటీయూ

GNTR: మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ కార్మికులు జీతాలు పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న సమ్మెకు తామంతా మద్దతుగా ఉంటామన్నారు.