'అఖండ-2' సినిమా.. 110 కేజీల భారీ కేక్ కటింగ్
ATP: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అనంతపురంలో సంబరాలు అంబరాన్నంటాయి. మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు ఆధ్వర్యంలో బాలయ్య అభిమానులు కలిసి 110 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. 'జై బాలయ్య' నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ.. అభిమానులు పట్టణంలో భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.