రేపు బత్తలపల్లిలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక

సత్యసాయి: బత్తలపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయాలలో మండల స్థాయి అధికారులతో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ స్వర్ణలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. మండల స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి మండలస్థాయి అధికారులందరూ తప్పక హాజరు కావాలని కోరారు.