'సమస్యలు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తాం'
ASF: RTC కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. బుధవారం పట్టణంలోని బస్ డిపో ఎదుట నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పేస్కేల్ చెల్లించాలని డిమాండ్ చేశారు.