చికిత్స పొందుతూ వివాహిత మృతి

చికిత్స పొందుతూ వివాహిత మృతి

MHBD: చికిత్సపొందుతూ వివాహిత మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలో జరిగింది. సోమవారం ఎస్సై చిర్ర రమేష్ బాబు వివరాలు వెల్లడించారు. మండలంలోని బంజారకు చెందిన బానోతు అరుణ(27) భర్త హుస్సేన్‌తో గొడవ పెట్టుకుని క్షణికావేశంలో గడ్డిమందు తాగింది. వెంటనే భర్త ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. అరుణ తండ్రి మోతిలాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.