VIDEO: అగ్ని ప్రమాదం.. అప్రమత్తమైన సిబ్బంది
కృష్ణా: మచిలీపట్నం మండలం బుద్ధాలపాలెం గ్రామంలో ఇవాళ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంటలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయో అని అగ్నిమాపక సిబ్బంది పరిశీలిస్తున్నారు.