వైసీపీ రౌడీయిజాన్ని ఎదుర్కొంటాం

అనంతపురం: జరగబోయే ఎన్నికల్లో వైసీపీ రౌడీయిజం చేయాలని చూస్తే అడ్డుకుంటామని అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. మంగళవారం అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్ లో టీడీపీ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులు రమణారెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.